శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ టైటిల్ టీజర్ రిలీజ్‌.. ఎలా ఉందంటే

శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ టైటిల్ టీజర్ రిలీజ్‌.. ఎలా ఉందంటే

Summarize with AI

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) తన కొత్త చిత్రంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల ‘అమరన్’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న కార్తికేయ‌న్‌.. సూపర్ హిట్ దర్శకురాలు సుధా కొంగర (Sudha Kongara) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పరాశక్తి’ (Parasakthi Teaser)అనే పాన్-ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం 1960-70ల కాలేజీ రాజకీయ నేపథ్యంలో సాగనుందని, శివ కార్తికేయన్ ఇందులో స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నారని టీజర్ ద్వారా తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్, డాన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరో జయం రవి (Ravi Mohan) విలన్ పాత్ర‌లో నటిస్తుండగా, శ్రీలీల, అథర్వ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీజర్‌లో “సైన్యమై కదలిరా.. పెను సైన్యమై కదలిరా” అనే శివ కార్తికేయన్ డైలాగ్ ఇప్పటికే వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్(GV Prakash) మ్యూజిక్ అందిస్తున్నాడు. శివ‌కార్తికేయ‌న్ కొత్త సినిమా గురించి త్వరలోనే మరిన్ని అప్డేట్‌లు రావొచ్చని చిత్రబృందం ప్రకటించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment