UNSCలో పాక్ ఏకాకి.. ఉగ్ర‌దాడిపై ఉక్కిరిబిక్కిరి

UNSCలో పాక్ ఏకాకి.. ఉగ్ర‌దాడిపై ఉక్కిరిబిక్కిరి

Summarize with AI

అంతర్జాతీయ వేదికైన (International Platform) యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC)లో పాక్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. క‌శ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడిని యూఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది. దాడి గురించి ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి పాకిస్తాన్‌ (Pakistan)పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. లష్కరే తోయిబా (Lashkar-e Taiba) ప్రమేయంపై పాక్‌ను యూఎన్ఎస్సీ ఆరా తీసింది. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఆగ్రహం వ్య‌క్తం చేసింది. పాక్ నుంచి సరైన స‌మాధానం లేక‌పోవ‌డంతో స‌భ్య దేశాలు మండిప‌డ్డాయి. పాకిస్తాన్‌ చెప్పిన పలు అంశాలను స‌భ్య దేశాలు తిర‌స్క‌రించాయి.

సమస్యను భారత్‌తో ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని యూఎన్ఎస్సీ సూచించింది. పహల్గామ్‌ ఘటనను ఉటంకిస్తూ భారత్‌పై పాక్ ఆరోపణలు చేసినా, ఆ మాటలకు మద్దతుగా చైనా (China) ఒక్క పదం కూడా మాట్లాడకపోవడం గమనార్హం. మరోవైపు అమెరికా (America) కూడా పాక్షికంగా మౌనమే పాటించడంతో పాక్‌కి యావత్తు యూఎన్ఎస్సీ వేదికపై ఒంటరిగా (Alone) మిగిలిపోయింది.

ఈ సమావేశంలో ఎటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడకపోవడమే కాక, పాక్ చేసిన ఆరోపణలు విశ్వసనీయంగా లేవన్న భావన స‌భ్య‌దేశాల స‌మావేశంలో వ్యక్తమైంది. దీని ఫలితంగా భారత్‌పై పాక్ వేసిన వ్యూహం అనుకున్నట్టు ఫలించకపోవడం విశేషం.

Join WhatsApp

Join Now

Leave a Comment