లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార (Nayanthara) ఇప్పుడు మరో పవర్ఫుల్ రోల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన ఆమె నటిస్తున్న హిందీ–తెలుగు (Hindi–Telugu) ద్విభాషా చిత్రంలో నయనతార పాత్రకు భారీ ప్రాధాన్యత ఉన్నట్లు సమాచారం. సాధారణ హీరోయిన్ పాత్రలా కాకుండా, ఈ మూవీలో ఆమె యాక్షన్ సన్నివేశాల్లోనూ (Action Scenes) కనిపించబోతున్నారట. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌తో కలిసి చేసే ఫైట్ సీక్వెన్స్‌లు (Fight Sequences) సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయిందని, ఆ సీన్స్ కోసం నయనతార ప్రత్యేకంగా రిహార్సల్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
ముంబై(Mumbai), హైదరాబాద్ (Hyderabad) ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్లో సల్మాన్–నయనతార కెమిస్ట్రీ అదిరిపోయిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉండేలా దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు (Dil Raju) నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ స్టైల్‌కు నయనతార పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ జత కావడంతో ఈ మూవీపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.








జనసేన నేత బూతు పురాణం.. ప్రెస్‌మీట్‌లోనే తిరగబడ్డ జర్నలిస్టులు (Video)