మార్ఫింగ్ ఫోటోలపై మృణాల్ ఫైర్..

మార్ఫింగ్ ఫోటోలపై మృణాల్ ఫైర్..

Summarize with AI

సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు అభిమానుల నుంచి ఎంత ప్రేమ పెరుగుతుందో, అదే స్థాయిలో ఆన్‌లైన్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence – AI), డీప్‌ఫేక్ టెక్నాలజీ (Deepfake Technology) దుర్వినియోగం సినీ ప్రముఖులకు కొత్త సవాల్‌గా మారుతోంది. తాజాగా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఇలాంటి ఘటనకు గురికావడంతో మరోసారి డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్చ మొదలైంది.

ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు మృణాల్ ఠాకూర్‌ మార్ఫింగ్ ఫోటోలను (Morphing Photos) షేర్ చేశారు. అసభ్యంగా ఉన్న ఆ ఫోటోలు వేగంగా వైరల్ కావడంతో ఈ విషయాన్ని మృణాల్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలని వాటిని షేర్ చేసిన వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఆ ఫోటోలను మళ్లీ షేర్ చేసినా, వైరల్ చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమనే సంకేతాన్ని ఆమె స్పష్టంగా ఇచ్చారు.

మృణాల్ ఎదుర్కొన్న ఈ పరిస్థితి కొత్తది కాదు. గతంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) సహా పలువురు ప్రముఖ నటీమణులు కూడా డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల బారిన పడ్డారు. ఏఐ టెక్నాలజీతో డెవలప్ అవుతున్నకొద్దీ దాని దుర్వినియోగం కూడా పెరుగుతుండటంతో సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనపై మృణాల్ స్పందించినప్పటికీ, వివాదాస్పద పోస్టర్లు మాత్రం ఇంకా చక్కర్లు కొడుతున్నాయనే తెలుస్తోంది.

పోలీసులి వాటిని ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన మరోసారి డీప్‌ఫేక్ కంటెంట్ నియంత్రణపై కఠిన చర్యలు అవసరమనే చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా, కెరీర్ పరంగా మృణాల్ ఠాకూర్ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. ‘హాయ్ నాన్న’ ‘సీతారామం’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు అల్లు అర్జున్ నటిస్తున్న’రాకా’ చిత్రంలోనూ నటించే అవకాశాలపై జోరుగా ప్రచారం సాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment