దేశంలో డ్రగ్స్(Drugs) మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన ‘నషా ముక్త్ భారత్’(Nasha Mukt Bharat) ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రముఖ సినీనటుడు, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో(Hyderabad) నిర్వహించిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’(Hyderabad Walks for Nasha Mukt Bharat) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఉద్యమానికి యువత నుంచి లభిస్తున్న మద్దతు ప్రశంసనీయమని అన్నారు.
పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు (Students) ఈ యాత్రలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున తెలిపారు. గత రెండు రోజులుగా ఈ కార్యక్రమాన్ని గమనిస్తున్నానని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండటంతో పాటు, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని యువతకు సూచించారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం అనేది కేవలం ప్రస్తుత తరానికే కాకుండా, రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ మంచి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని నాగార్జున కోరారు.








