మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కొత్త సాంకేతికత.. ఆకాశం నుంచి దర్శన అవకాశం

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో కొత్త సాంకేతికత.. ఆకాశం నుంచి దర్శన అవకాశం

Summarize with AI

తెలంగాణ కుంభమేళా (Telangana Kumbh Mela)గా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర (Medaram Sammakka–Saralamma Jatara) కోసం ఈసారి ములుగు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చింది. జాతర చరిత్రలో తొలిసారిగా భక్తులు వాట్సాప్ ద్వారా అన్ని వివరాలు పొందగలుగుతారు. 7658912300 అనే నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా జాతర ప్రాంగణం, దర్శన సమయాలు, ట్రాఫిక్ మార్గాలు, పార్కింగ్, రవాణా మరియు అత్యవసర సేవల వివరాలను నేరుగా మొబైల్ ఫోన్‌లో పొందవచ్చు. ఈ డిజిటల్ చాట్ బాట్ ద్వారా భక్తులు దారి తప్పడం, అనుకోని ఇబ్బందులు ఎదురవడం వంటి పరిస్థితుల్లో తక్షణ పరిష్కారం పొందగలుగుతారు.

జాతరలో భక్తుల సౌకర్యాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులను (Helicopter Services) కూడా అందిస్తోంది. పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా భక్తులు ఆకాశం నుండి 6–7 నిమిషాల పాటు జాతర ప్రాంగణాన్ని వీక్షించవచ్చు. ఒక్కోరు రూ.4800 చార్జ్ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి నేరుగా మేడారం చేరుకుని, తిరిగి వచ్చే ప్రయాణానికి ఒక్కొక్కిరికి రూ. 35,999 ఛార్జ్ నిర్ణయించారు. ఈ సర్వీసులు ఫిబ్రవరి 28 నుండి 31 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5.20 వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

మొత్తంగా ఈ సాంకేతికత మరియు హెలికాప్టర్ సేవల ద్వారా భక్తులు జాతరను సులభంగా, సురక్షితంగా, తక్షణ సమాచారం పొందుతూ, విహంగ వీక్షణంలో అనుభవించగలుగుతారు. ములుగు జిల్లా కలెక్టర్, పోలీస్ విభాగం పర్యవేక్షణలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కూడా సులభంగా ఈ సేవలను వినియోగించుకొని, సమయం ఆదా చేసుకుంటూ అమ్మవార్ల దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా ఆస్వాదించగలరు.

Join WhatsApp

Join Now

Leave a Comment