బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు?.. రాజకీయాల్లో కొత్త మలుపు

మల్లారెడ్డి కోడలు బీజేపీ కార్యాలయానికి… రాజకీయాల్లో కొత్త మలుపు?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సి.హెచ్. మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి (Dr. Preeti Reddy) బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. గత కొన్ని రోజులుగా ఆమె బీజేపీలో చేరతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆఫీస్‌లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇక కమలం పార్టీలో చేయడానికి సమయం దగ్గరపడుతోందనే వాదనలు మొదలయ్యాయి. గతంలోనూ మల్లారెడ్డితోపాటు ప్రీతిరెడ్డి, కుమారుడు భద్రారెడ్డితో కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.

మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్‌లో గూగుల్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ ఏఐ-ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీని ఆహ్వానించారు. అప్పట్లో వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా.. డాక్టర్ ప్రీతి రెడ్డి ప్రస్తుతం మల్లారెడ్డి విద్యాసంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

విద్యార్థులకు, సమాజానికి ఆమె చేస్తున్న కృషికి గాను ‘చాంపియన్షిప్ చేంజ్ 2024’ అవార్డును అందుకున్నారు. ఏప్రిల్ 2025లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో తీవ్ర అనారోగ్యానికి గురైన 74 ఏళ్ల వృద్ధుడికి సీపీఆర్ చేసి, వైద్య నైపుణ్యంతో ప్రాణాలు కాపాడారు. అప్పట్లో వార్తల్లో నిలిచారు.

Join WhatsApp

Join Now

Leave a Comment