తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (TGIIC) ఆధీనంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలన్న ప్రభుత్వం నిర్ణయం వివాదానికి దారితీసింది. రూ.25 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈ భూముల అమ్మకానికి ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అప్పు చేసి చిప్ప కూడు
అప్పు చేసి పప్పు కూడు నాటి సామెత.. అప్పు చేసి చిప్ప కూడు నేటి కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత అని వ్యాఖ్యానించారు. BRS హయాంలో రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటుతో 70 లక్షల రైతులకు అండగా నిలిచామన్నారు. అలాగే కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, గురుకుల పాఠశాలలు, మెడికల్ కాలేజీలు లాంటి పథకాలు అమలులో పెట్టామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు
15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.65 లక్షల కోట్లు అప్పు చేసి కూడా రైతులకు ఎలాంటి మేలు చేయలేదని, రుణమాఫీ, రైతుబంధు ఎగ్గొట్టారని కేటీఆర్ మండిపడ్డారు. కరెంటు కోతలు, గురుకులాల పట్ల నిర్లక్ష్యం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆపివేయడం, పాలమూరు రంగారెడ్డిని నిలిపివేయడం లాంటి అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లే చర్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లీలో గాలి మాటలు.. ఢిల్లీకి ధనం మూటలు మోసుడు కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని కేటీఆర్ తన ట్వీట్‌లో ఘాటుగా స్పందించారు.
అప్పు చేసి, పప్పు కూడు
— KTR (@KTRBRS) March 5, 2025
నాటి సామెత
అప్పు చేసి, చిప్ప కూడు
నేటి కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత
నాడు అప్పు చేసి
70 లక్షల అన్నదాతలకు అండగా నిలిచి
వారికి రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఖాతాల్లోకి వేసి
రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసి
రూ.6 వేల కోట్లతో రైతుబీమా చేసి
లక్ష 11 వేల కుటుంబాలకు… pic.twitter.com/dYBA8aoTvp









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్