రేవంత్ నిరూపిస్తే రాజ‌కీయాలు వ‌దిలేస్తా.. – కేటీఆర్ సంచ‌ల‌నం

రేవంత్ నిరూపిస్తే రాజ‌కీయాలు వ‌దిలేస్తా.. - కేటీఆర్ సంచ‌ల‌నం

Summarize with AI

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో చివరి రోజు సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేటీఆర్ (KTR) మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా మారింది. గత ప్రభుత్వం తనపై కక్ష కట్టి ఇబ్బందులు కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే, దీనికి కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ, “రేవంత్ రెడ్డికి ఫ్రస్టేషన్ (Frustration) ఎందుకు తగ్గడం లేదు? సీఎం కుర్చీలో కూర్చున్నా కూడా కూల్ కావడం లేదే!” అంటూ సెటైర్లు వేశారు.

“రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వవద్దని ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసినది అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ (PCC President) అయిన రేవంత్ రెడ్డే. ఇప్పుడు మేము రైతులకు మోసం చేశామంటారా?” అని ప్రశ్నించారు. ఆ లేఖ తన వద్ద ఉందని, కావాలంటే ప్రూఫ్ చూపించగలనని అన్నారు. ప్రతి సారి రుణమాఫీ (Loan Waiver) అంటారని, ఏ ఒక్క గ్రామమైనా వంద శాతం రుణమాఫీ చేస్తే, తాను శాశ్వతంగా రాజకీయాలను (Politics) వదిలేస్తాన‌ని కేటీఆర్ సవాల్ (Challenge) విసిరారు. కొండారెడ్డిపల్లి (Kondareddypalli) కి పోదామా? లేక సిరిసిల్ల (Sircilla) కి పోదామా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.

వందరోజుల్లో (100 days) తులం బంగారం (Gold) అంటే, ప్రజలు లంకె బిందెల కోసం ఎదురు చూడాలా? అని ప్రశ్నించారు. తాము కూడా జైలుకెళ్లాం.. రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య ఉద్యమం చేసి జైలుకెళ్లలేదుగా అంటూ సీఎం వ్యాఖ్యలను కేటీఆర్ ఎండగట్టారు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు, కక్షసాధింపే లేదంటారా? మ‌రి బీఆర్ఎస్ (BRS) తెచ్చిన‌ పథకాలను ఎందుకు రద్దు చేశారు? అని ధ్వజమెత్తారు.

ఫార్మాసిటీ రద్దు – రైతుల కోసం పోరాటం
ఫార్మాసిటీ (Pharma City) వద్దన్నారు, ఫార్మా విలేజ్‌లన్నారు.. లగచర్ల (Lagcherla) లో 9 నెలలుగా రైతులు ధర్నా చేస్తే పట్టించుకోలేదు. రైతులు (Farmers) అధికారులను అడ్డుకుంటే, వాళ్లను కేసులుకు గురిచేయడం తగిందా? అంటూ మండిపడ్డారు. కాగా, రుణ‌మాఫీపై కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment