తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party)లో మరోసారి వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై వరంగల్ సీనియర్ నేత, మంత్రి కొండా సురేఖ(Konda Surekha) భర్త కొండా మురళీ (Konda Murali) ఫిర్యాదు అధిష్టానానికి చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో పొంగులేటి మితిమీరిన జోక్యం, మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే (Kharge)కు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు.
ఖర్గేతో ఫోన్ లో మాట్లాడిన కొండా మురళీధర్‌రావు.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ లకు కూడా మేడారం పనుల వ్యవహారాలు, వరంగల్ జిల్లా రాజకీయాల్లో పొంగులేటి పెడుతున్న ఇబ్బందులను కొండా దంపతులు నివేదించినట్ల సమాచారం.
తమ జిల్లాలో.. తన శాఖలో ఆయన పెత్తనం ఏంటని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా కొండా దంపతులు వరంగల్ కు చెందిన కాంగ్రెస్ లీడర్ల మధ్య విభేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపైన కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ కలుగజేసుకుని వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.









‘చిన్నోడు.. పెద్దోడు’.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు