ట్రంప్ చెప్పిన 24 గంటల్లోనే బ్రిటన్ ప్రధాని రాజీనామా..

ట్రంప్ చెప్పిన 24 గంటల్లోనే బ్రిటన్ ప్రధాని రాజీనామా..

బ్రిటన్ రాజకీయాల్లో(Britain Politics) మరో పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom) ప్రధానమంత్రి (Prime Minister) కీర్ స్టార్మర్ (Keir Starmer) తన పదవికి రాజీనామా (Resignation) చేస్తున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీకి (Labour Party) ఘన విజయం అందించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన స్టార్మర్, కేవలం రెండేళ్లలోనే పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరంగా, స్టార్మర్ ప్రధానిగా కొనసాగడం కష్టమని, త్వరలోనే ఆయన పదవి నుంచి వైదొలగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఆ వ్యాఖ్యల తర్వాత 24 గంటలు గడవకముందే స్టార్మర్ రాజీనామా నిర్ణయం వెలువడటం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

స్టార్మర్ రాజీనామాతో బ్రిటన్‌లో (Britain) రాజకీయ అస్థిరత మరోసారి వెలుగులోకి వచ్చింది. గత పదేళ్ల కాలంలోనే ఆరుగురు ప్రధానులు పదవులకు రాజీనామా చేయడం యూకే(UK) రాజకీయ వ్యవస్థలో పెరుగుతున్న ఒత్తిళ్లను సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బ్రెగ్జిట్, ఆర్థిక సవాళ్లు, పార్టీ అంతర్గత విభేదాలు వంటి అంశాలు బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా, తాజా పరిణామం దేశ రాజకీయ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. స్టార్మర్ తర్వాత ప్రధానమంత్రి పదవిని ఎవరు చేపడతారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment