ధాన్యంతో సచివాలయం ముట్టడి.. కవిత అరెస్ట్‌తో ఉద్రిక్తత

ధాన్యంతో సచివాలయం ముట్టడి.. కవిత అరెస్ట్‌తో ఉద్రిక్తత

తెలంగాణలో (Telangana) వరి ధాన్యం కొనుగోళ్లలో (Paddy Grain Procurement) జరుగుతున్న జాప్యాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సచివాలయం (Hyderabad Secretariat) ప్రధాన ద్వారం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ఆందోళన చేపట్టి సచివాలయాన్ని ముట్టడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల్లో(IKP Centers) రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తేమ శాతం, తరుగు పేరుతో మిల్లర్లు మరియు అధికారులు కలిసి రైతులను (Farmers) మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రైతులకు మద్దతుగా క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ప్రకటించాలని, ఎలాంటి నిబంధనలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

నిరసనలో భాగంగా కవిత సచివాలయం మెయిన్ గేట్ ఎదుట రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు కవితతో పాటు పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment