క‌రీంన‌గ‌ర్ దోపిడీ కేసు.. కీల‌క ఆధారాలు ల‌భ్యం

క‌రీంన‌గ‌ర్ దోపిడీ కేసు.. కీల‌క ఆధారాలు ల‌భ్యం

కరీంనగర్ (Karimnagar) పీఎంజే (PMJ) జ్యువెల్లరీ (Jewellery) దోపిడీ కేసులో తెలంగాణ పోలీసులు (Telangana Police) దర్యాప్తును ముమ్మరం చేశారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండటంతో ఈ కేసు ఛేదనకు పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో దుండగుల కదలికలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయి. కాగా, పీఎంజే జ్యువెల్లరీలో భారీ దోపిడీకి పాల్పడటానికి ముందే దుండగులు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల మకాం
ఐదుగురు సభ్యుల ఈ ముఠా జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జ్‌లో(Vijayalakshmi Lodge) మూడు రోజుల పాటు బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. లాడ్జ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, దుండగుల దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది. దొంగతనం చేయడానికి ముందు వారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

గోదావరి దాటి పరారీ.. బైక్ లభ్యం
కరీంనగర్‌లో దోపిడీ ముగించుకున్న తర్వాత దుండగులు మళ్లీ ధర్మపురి వైపునకే పారిపోయినట్లు ఆధారాలు లభించాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో గోదావరిలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంది. దీనిని అనుకూలంగా మార్చుకున్న దొంగలు, ధర్మపురి వద్ద గోదావరి నది గుండా అవతలి గట్టుకు చేరుకున్నారు. నది దాటే క్రమంలో తాము వాడిన ఒక బైకును అక్కడే పడేసి వెళ్లారు. అయితే, అక్కడి నుంచి వారు మరో బైకుపై లేదా ఇతర వాహనాల్లో ఎటువైపు వెళ్లారు అనే దానిపై పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.

పోలీసులకు సవాల్‌గా మారిన కేసు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దోపిడీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తెలంగాణ పోలీసు శాఖ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మొత్తం 16 ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. నిందితులు ధర్మపురి దాటి ఆదిలాబాద్ అడవుల గుండా మహారాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పొరుగు రాష్ట్ర పోలీసుల సహాయాన్ని కూడా కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment