పిఠాపురంలో జనసేన కుటుంబాల గ్రామ బహిష్కరించిన టీడీపీ

పిఠాపురంలో జనసేన కుటుంబాల గ్రామ బహిష్కరించిన టీడీపీ

Summarize with AI

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం కొత్తపల్లి మండలంలోని పొన్నాడ శివారు కోనపాపపేటలో జనసేనకు చెందిన నాలుగు కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కేఎస్‌ఈజెడ్‌లో పైప్‌లైన్ నిర్మాణం కారణంగా స్థానిక మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, జనసేన నేతలు కంపెనీ వద్ద రూ.6 కోట్లు తీసుకున్నట్లు టీడీపీ నేతలు ఆరోపించారు.

గ్రామ బహిష్కరణ ప్రకటన
గ్రామస్తులు సమావేశం నిర్వహించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేనకు చెందిన పల్లేటి కుటుంబాలకు జరిమానా విధించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తీవ్ర కోపంతో ఆరుగురు వ్యక్తులు టీడీపీ నేతలపై దాడి చేయగా, ఇద్దరికి గాయాలయ్యాయి.

దీంతో గ్రామంలో బహిరంగంగా మైక్‌ల ద్వారా జనసేన కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసినట్లు ప్రకటించారు. బ‌హిష్క‌రించిన కుటుంబాల‌తో ఎవరు వారైనా మాట్లాడినా, సహకరించినారూ.లక్ష జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. దుకాణాలు, సహాయం నిషేధం చేశారు. ఈ పరిణామంపై గ్రామ సచివాలయ సిబ్బంది అధికారులను సమాచారం అందించగా, అధికారులు చేరుకుని గ్రామ బహిష్కరణ ప్రకటనను నిలిపివేశారు.

రాజకీయ రంగు
ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదులు ఒకవైపు, గ్రామస్థుల ఆందోళన మరోవైపు కొన‌సాగుతున్నాయి. టీడీపీ నేతలు తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తుండగా, జనసేనకు చెందిన కుటుంబాలు గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త‌త నెల‌కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment