ఇటీవల ఎయిర్‌పోర్టు (Airport)లో అరెస్టు అయిన మాజీ డిప్యూటీ సీఎం (Former Deputy CM) అంజాద్ బాషా (Anjad Basha) సోదరుడు (Brother) అహ్మద్ బాషా (Ahmed Basha)కు బెయిల్ (Bail) మంజూరు అయ్యింది. ఇరుపక్షాల వాదనలు విన్న కడప కోర్టు (Kadapa Court) అహ్మద్ బాషాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు (Orders) జారీ చేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు, మరో కేసులో పోలీసులు వేసిన పిటి వారెంట్‌ను సైతం డిస్మిస్ చేసింది. చిన్న స్థల వివాదంలో కడప తాలూకా స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇరువర్గాలు రాజీ పడినా కక్ష పూరితంగా అదనపు సెక్షన్లు జోడించి కేసును మళ్లీ ఓపెన్ చేశారని వైసీపీ నేతలు (YSRCP Leaders) ఆరోపిస్తున్నారు. లుక్ అవుట్ నోటీసులిచి మరీ ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారని, ఈ కేసులో అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అరెస్టు అనంతరం కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించిన కోర్టు.. నేడు బెయిల్ పిటిషన్ పై వాదనలు విని బెయిల్ మంజూరు చేసింది.
News Wire
-
01
విశాఖలో 2 నెలలు చేపలు వేట నిషేదం
వేట నిషేదం తో ఒడ్డుకే పరిమితం కానున్న 600కుపైగా మరబోట్లు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిలిచిపోనున్న విక్రయాలు.
-
02
చందనోత్సవ టికెట్ల జారీలో తీవ్ర గందరగోళం
సింహాచలం లో అరకొరగా టికెట్లు విక్రయిస్తున్న దేవస్థానం అధికారులు. గంటల తరబడి క్యూలైన్ లో ఉన్నా భక్తులకు తప్పని నిరాశ.
-
03
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
టీడీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలతో మంగళగిరి పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. సెల్ టవర్ నుంచి దూకేస్తానంటూ యువకుడి హెచ్చరిక.
-
04
తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ..
రాజధాని అమరావతి వద్దు.. 3 జిల్లాల మావిగన్ తోనే అభివృద్ధి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు
-
05
ఏబీఎన్ రాధాకృష్ణపై పీఎస్ ల్లో ఫిర్యాదులు
ఏపీ వ్యాప్తంగా రాధాకృష్ణ బూతు రాతలపై వైసీపీ నేతల ఫిర్యాదు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
-
06
అనకాపల్లి బీసీ బాలికల వసతి గృహంలో అక్రమాలు
మెనూ అమలు లేదు, విద్యార్థుల ఆవేదన. ఆదివారం ఇతర పనులు చెబుతున్నారని విద్యార్ధినులు ఆవేదన
-
07
లడ్డూ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతుంది.
-
08
కేబినెట్ కి ఆరుగురు మంత్రుల గైర్హాజరు
కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్, నాదెండ్ల, అనిత, టీజీ భరత్, గొట్టిపాటి, ఫరూక్ గైర్హాజరు
-
09
ఏపీలో పలు చోట్ల గ్యాస్ సిలిండర్ల కొరత..
విజయవాడలో గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు క్యూకట్టిన జనం. కస్టమర్లు బుక్ చేయకుండానే చేసినట్లు మెసేజ్‌లు.
-
10
మామిడి రైతులపై యుద్ధం ప్రభావం
విదేశాల్లో తెలుగురాష్ట్రాల మామిడికి డిమాండ్. ప్రతి ఏటా గల్ఫ్ దేశాలకు భారీగా మామిడి ఎగుమతి








