కడప ఉక్కుపై ‘జిందాల్’ ట్వీట్.. జ‌గ‌న్‌కు ద‌క్కిన క్రెడిట్‌

కడప ఉక్కుపై ‘జిందాల్’ ట్వీట్.. జ‌గ‌న్‌కు ద‌క్కిన క్రెడిట్‌

కడప జిల్లా (Kadapa District) జమ్మలమడుగులో (Jammalamadugu) జేఎస్‌డబ్ల్యూ (JSW) స్టీల్ ప్లాంట్ పనుల (Steel Plant Works) పునఃప్రారంభం వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్‌ను తమది చెప్పుకుంటున్న కూటమి నేతలకు, జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ (Sajjan Jindal) ఇచ్చిన రిప్లై షాక్‌కు గురిచేసింది. వైసీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన ట్వీట్‌కు (Tweet) సజ్జన్ జిందాల్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు కూటమి నేతల నోట్లో పచ్చి వెలక్కాయ్ పడినంత ప‌నిచేసింది. జిందాల్ ఇచ్చిన క్లారిటీతో ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ (Credit) బాల్ కాస్తా పూర్తిగా వైఎస్ జగన్ కోర్టులోనే పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కడపలో స్టీల్ ప్లాంట్ పనులు తిరిగి ప్రారంభం కావడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన నాటి ఫోటోను ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ.. సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ తన ట్వీట్‌లో పలు కీలక విషయాలను పంచుకున్నారు.

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఒక కీలకమైన మైలురాయి. వైసీపీ ప్రభుత్వ (YSRCP Government) హయాంలోనే జేఎస్‌డబ్ల్యూ ప్రాజెక్టు (JSW Project) రూపుదిద్దుకోవటానికి కీలకమైన పునాదులు వేశాం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు పొందేందుకు పూర్తి సహకారం అందించాం. గండికోట నుంచి నీటి కేటాయింపులు (Water Allocation) చేయడంతో పాటు.. భూకేటాయింపు(Land Allocation), రోడ్ల అనుసంధానం, ఇతరత్రా మౌలిక సదుపాయాల (Infrastructure కోసం అవసరమైన భూమిని కూడా అందించాం. ఆ కారణంగానే ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు కదిలాయి. కడప నా సొంత జిల్లా కావడంతో ఈ ప్రాజెక్టుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. కడప, రాయలసీమ ప్రజలకు ఉపాధి కల్పించడంలో జేఎస్‌డబ్ల్యూ సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని జగన్ పేర్కొన్నారు.

సజ్జన్ జిందాల్ సంచలన రిప్లై!
వైఎస్ జగన్ చేసిన ఈ ట్వీట్‌కు జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ (Sajjan Jindal) స్పందిస్తూ రిప్లై ఇవ్వ‌డం ప్రాధాన్యత సంత‌రించుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే స్టీల్ ప్లాంట్‌కు అన్ని రకాల అనుమతులు లభించాయనే నిజాన్ని జిందాల్ తన ట్వీట్ ద్వారా స్వయంగా వెల్లడించారు. “జగన్ ప్రభుత్వ హయాంలో లభించిన ప్రారంభ అనుమతుల (Initial Approvals) నుండి.. నేటి ఈ ప్రారంభోత్సవం వరకు సాగిన ఈ ప్రయాణం నిరంతర కృషికి నిదర్శనం. వైఎస్సార్ కడప జిల్లా ప్రాంత యువత, కుటుంబాల కోసం ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని సజ్జన్ జిందాల్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment