జపాన్ లో భారీ భూకంపం

జపాన్ లో భారీ భూకంపం

జపాన్‌లో (Japan) మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్ (Northern Japan) తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో (Pacific Ocean) భూమి సుమారు 10 కి.మీ లోతులో కేంద్రంగా రిక్టర్ స్కేలుపై (Richter Scale) 7.4 తీవ్రతతో భూకంపం నమోదు కావడంతో ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. ముఖ్యంగా ఇవాటే (Iwate) మరియు హొక్కైడో (Hokkaido) ప్రిఫెక్చర్‌ల తీర ప్రాంతాల్లో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసి, తీర ప్రాంతాల్లోని ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని ఆదేశించింది. సుమారు 3 మీటర్ల వరకు రాకాసి అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించడంతో రక్షణ చర్యలు వేగంగా చేపట్టారు.

అమోరి, హచినోహే (Hachinohe) వంటి నగరాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించగా, ప్రజలు నిలబడలేని స్థాయిలో భూమి కంపించినట్లు సమాచారం. మరోవైపు, ఈ ప్రాంతానికి సమీపంలో అణు విద్యుత్ కేంద్రాలు ఉండటంతో ప్రారంభంలో తీవ్ర ఆందోళన నెలకొన్నా, ఎలాంటి అసాధారణ పరిస్థితులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కొంత ఊరట లభించినప్పటికీ సునామీ ముప్పు ఇంకా కొనసాగుతుండటంతో తీర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రకటనలు వచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment