జమ్మూకాశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది మృతి

జమ్మూకాశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది మృతి

జమ్మూకాశ్మీర్‌లో (Jammu & Kashmir) ఘోర ఘోర ప్రమాదం జరిగింది. రామ్‌నగర్ (Ramnagar) నుంచి ఉధంపూర్‌కు (Udhampur) వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్ నియంత్రణ (Driver Control) కోల్పోవడంతో బస్సు లోయలో పడినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రామ్‌నగర్ నుంచి ఉధంపూర్‌కు వెళ్తుండగా బస్సు లోయలో పడిపోయింది. సంఘటనా స్థలిలో 15 మంది చనిపోగా.. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. పోలీసులు, సైన్యం సహాయ చర్యలు చేపట్టారు. అయితే కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) స్పందిస్తూ.. తాను జిల్లా అధికారులతో మాట్లాడానని.. తీవ్రంగా గాయపడిన వారిని విమానంలో తరలించే ఏర్పాట్లతో సహా సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా జితేంద్ర సింగ్ తెలిపారు. స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment