8 నెలల గర్భవతిని చంపి.. అద్దె ఇంట్లోనే పాతిపెట్టి భ‌ర్త‌ పరార్

8 నెలల గర్భవతిని చంపి.. అద్దె ఇంట్లోనే పాతిపెట్టి భ‌ర్త‌ పరార్

Summarize with AI

ప్రియురాలు ఫోన్ ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంద‌ని, మ‌రొక‌రితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌నే అనుమానంతో హ‌త్య చేసి అద్దె ఇంట్లో పాతిపెట్టి ప్రియుడు ప‌రారైన సంఘ‌ట‌న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. బిందయాక ప్రాంతంలో 8 నెలల గర్భవతి అయిన కిరణ్‌ (32)ను ఆమెతో సహజీవనం చేస్తున్న ప్రవేశ్ రావత్‌ (22) గొంతు నులిమి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.

ఫోన్ వాడకంపై అనుమానం.. దారుణ హత్య
ప్రవేశ్ రావత్‌, కిరణ్ కొంతకాలంగా బిందయాక ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. అయితే ఇటీవల కిరణ్ తరచూ ఫోన్‌ ఉపయోగిస్తుండటంతో ప్రవేశ్‌కు అనుమానం పెరిగింది. ఆమెకు మరొకరితో సంబంధం ఉందని భావించిన అతడు తీవ్ర ఆగ్రహానికి గురై కిరణ్‌ను గొంతు నులిమి హతమార్చాడు.

ఇంటి ఆవరణలోనే మృతదేహం..
హత్య అనంతరం విషయం బయటకు రాకుండా మృతదేహాన్ని అద్దె ఇంటి ఆవరణలో పాతిపెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఇంటికి చేరుకుని ఆవరణను పరిశీలించగా కిరణ్ మృతదేహం బయటపడింది.

సీసీ కెమెరాలు, ఫోన్ డేటాతో నిందితుడి పట్టివేత
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు, ఫోన్ డేటాను పరిశీలించారు. వాటి ఆధారంగా ప్రవేశ్ రావత్‌ ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తొలుత కిరణ్ ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసిన ప్రవేశ్.. విచారణలో ఆమె ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో అనుమానం వచ్చి హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో కిరణ్ 8 నెలల గర్భంతో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. గర్భవతిని హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పాతిపెట్టి పరారైన ఈ ఘటన జైపూర్‌లో తీవ్ర కలకలం రేపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment