“డబ్బు వెనుక పరిగెత్తొద్దు”: జగపతి బాబు

"డబ్బు వెనుక పరిగెత్తొద్దు": జగపతి బాబు

Summarize with AI

టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు ఇటీవల ఓ ప్రముఖ పాడ్ క్యాస్ట్ షోలో పాల్గొని జీవితంలో ఆయన ఎదుర్కొన్న అనేక అనుభవాలను షేర్ చేశారు. డబ్బు, ఆస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వైరల్‌గా మారాయి. జగపతి బాబు మాట్లాడుతూ, మనం డబ్బు వెనుక పరిగెత్తకూడదు, అది మన దగ్గరికి వచ్చేలా ఉండేలా చూడాలి అని చెప్పారు. డబ్బు కేవలం అవసరాలను తీర్చే ఒక సాధనమని మాట్లాడారు. హీరోగా, ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను చూసిన వ్యక్తిగా నాకు డబ్బు విలువ బాగా తెలుసు అని తెలిపారు.

అతను తెలిపిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ రోజుల్లో మనిషి కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ధోరణి చాలా ప్రమాదకరమని, డబ్బు కోసం స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా దూరం చేయడం తప్పు అని అన్నారు. వందల కోట్ల ఆస్తులు పోయినా, ఇప్పుడు శాంతిగా జీవిస్తున్నానని, నిజమైన సంపద అంటే మంచి ఆహారం, ప్రశాంతమైన నిద్ర, ప్రేమగా పలకరించే మనుషులు ఉంటే చాలమని ఆయన స్పష్టంగా తెలిపారు. జగపతి బాబు చెప్పిన ఈ సందేశం డబ్బు, సంపద కన్నా జీవితంలోని విలువలపై ఆలోచించమని అభిమానులను ప్రేరేపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment