ఇజ్రాయెల్‌ బాంబు దాడి.. తృటిలో త‌ప్పించుకున్న WHO చీఫ్‌

ఇజ్రాయెల్‌ బాంబు దాడి.. తృటిలో త‌ప్పించుకున్న WHO చీఫ్‌ టెడ్రోస్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గ్యాబ్రియాసిస్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటన యెమెన్‌లో జరిగింది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడి నేపథ్యంలో, సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో టెడ్రోస్‌ ఉన్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

దాడి వివరాలు
గురువారం టెడ్రోస్‌ యెమెన్‌లో పర్యటించారు. ఖైదీల విడుదల, యుద్ధ ప్రభావంతో ఉన్న ప్రజల పరిస్థితులను అంచనా వేయడానికి అక్కడికి వెళ్లారు. చర్చలు ముగిసిన తరువాత, సనాలో విమానం ఎక్కేందుకు వేచి ఉండగా, వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో టెడ్రోస్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.

దాడి తర్వాత, టెడ్రోస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “మేము యెమెన్‌లోని మానవతా పరిస్థితులను అంచనా వేయడానికి వెళ్లాం. సనాలో ఉన్న సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. కొన్ని మీటర్ల దూరంలో జ‌రిగిన‌ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాను” అని ఆయన పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి ఖండన
ఈ ఘటనపై ఐక్య‌రాజ్య స‌మితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ తీవ్రంగా స్పందించారు. “యెమెన్‌లో పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఆందోళనకరం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి” అని ఆయన ఎక్స్ వేదిక‌గా సూచించారు.

యెమెన్‌లో పరిస్థితుల తీవ్రత
ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు యెమెన్‌లో ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. సనా అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యుత్ కేంద్రాలు, మరియు ఇతర కీలక స్థలాలు ఈ దాడుల్లో నాశనం అయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment