ఇషాన్ కిషన్‌కు గాయం.. వైభవ్ సూర్యవంశీకి టీమిండియాలో ఛాన్స్‌?

ఇషాన్ కిషన్‌కు గాయం.. వైభవ్ సూర్యవంశీకి టీమిండియాలో ఛాన్స్‌?

Summarize with AI

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఇషాన్ కిషన్ గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తొలి టీ20 సందర్భంగా అతను తీవ్రమైన కండరాల నొప్పితో ఇబ్బందిపడ్డాడని భారత బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ వెల్లడించారు. గాయం కారణంగానే తొలి మ్యాచ్‌లో ఇషాన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయాల్సి వచ్చిందని, శనివారం జరిగే రెండో టీ20కి కూడా అతను దూరమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కవచ్చనే అంచనాలు మొదలయ్యాయి.

ఇషాన్ అందుబాటులో లేకపోతే వైభవ్‌కు అవకాశం కల్పించే అంశాన్ని టీమిండియా పరిశీలించే అవకాశం ఉంది. వైభవ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగితే సంజు శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. తొలి టీ20లో 67 పరుగులతో అర్ధశతకం సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంజు స్థానంలో మార్పు జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రెండో టీ20లో వైభవ్ ఆడతాడా, తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment