హైకోర్టు ఆదేశాల మేరకు సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీబీఐ జోనల్ కార్యాలయానికి వెళ్లిన సిట్ అధికారులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేశారు. కేసు ఎఫ్‌ఐఆర్ (FIR), చార్జిషీట్‌తో పాటు ఇప్పటివరకు సేకరించిన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలు, కేసు డైరీ (సీడీ ఫైల్) సహా సంబంధిత రికార్డులన్నింటినీ సీబీఐ అధికారులకు అప్పగించారు.
మరోవైపు, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించిన పరిణామాలను పరిశీలించేందుకు సీబీఐ బృందం నేడు విజయవాడకు రానుంది. కేసు దర్యాప్తును చేపట్టే క్రమంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, సిట్ సేకరించిన ఆధారాలు, సమర్పించిన పత్రాలను బృందం పరిశీలించనుంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టనుండటంతో తదుపరి విచారణపై ఆసక్తి నెలకొంది.








