తల్లి త్యాగం నుంచి ఐపీఎల్ గ్లోరీ వరకు ఆ ప్లేయర్ జర్నీ

తల్లి త్యాగం నుంచి ఐపీఎల్ గ్లోరీ వరకు ఆ ప్లేయర్ జర్నీ

Summarize with AI

ఐపీఎల్(IPL) 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH) తరఫున అరంగేట్రం చేసిన యువ ఫాస్ట్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ (Saqib Hussain) ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాడు. బీహార్‌లోని (Bihar) గోపాల్‌గంజ్ (Gopalganj) నుంచి వచ్చిన ఈ 21 ఏళ్ల కుర్రాడు తన తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌పై(RR) విధ్వంసకర బౌలింగ్‌తో 4 వికెట్లు తీసి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. కేవలం 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి కీలక వికెట్లు పడగొట్టడంతో, రాజస్థాన్ రాయల్స్ రాజస్ధాన్ రాయిల్స్ బ్యాటింగ్ లైనప్‌ పూర్తిగా కుదేలైంది. దీంతో అతని ప్రదర్శన సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి “నెక్స్ట్ బిగ్ థింగ్”గా (Next Big Thing) చర్చలు మొదలయ్యాయి.

సాకిబ్ హుస్సేన్ ప్రయాణం మాత్రం కష్టాలు, త్యాగాల కథ. భారత సైన్యంలో చేరాలని కలలు కన్న ఈ యువకుడు పరిస్థితుల కారణంగా క్రికెట్ వైపు మళ్లాడు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా తల్లి తన నగలు అమ్మి అతనికి క్రికెట్ షూస్ కొనిచ్చిన ఘటన ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. గంటకు 140 కి.మీ.కు పైగా వేగంతో బంతులు వేస్తూ, స్లోయర్ డెలివరీలతో బ్యాటర్లను మోసగించే అతని ప్రత్యేక శైలి అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది. గతంలో ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్విని కుమార్ అరంగేట్ర రికార్డును సమం చేసిన ఈ యువ సంచలనం, ఇప్పుడు ఐపీఎల్‌లో కొత్త స్టార్‌గా ఎదుగుతున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment