లంచం ఇస్తేనే లబ్దిదారుల జాబితాలో పేరు?

లంచం ఇస్తేనే లబ్దిదారుల జాబితాలో పేరు?

Summarize with AI

ప్ర‌భుత్వం (Government) ఇస్తాన‌న్న ఇందిర‌మ్మ ఇల్లు (Indiramma House) జాబితాలో పేరు రావాలంటే అర్హ‌త మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. అధికారులు, స్థానిక నేత‌ల చేతులు కూడా త‌ప‌డాల్సిందేన‌ట‌. అన్నీ ఇచ్చి లిస్ట్‌లో త‌న పేరు (Name) లేక‌పోవ‌డంతో ఓ వ్య‌క్తి వాట‌ర్ ట్యాంక‌ర్ (Water Tank) పైకి ఎక్కి నిర‌స‌న (Protest) తెలిపిన సంఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. సూర్యాపేట (Suryapet) జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి (Velugupalli) గ్రామంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కనకయ్య (Kanakayya) అనే వ్యక్తి గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆందోళన చేశాడు. స్థానికులు, పోలీసులు కలిసి నచ్చజెప్పి కనకయ్యను కిందికి దించగలిగారు. ఈ సందర్భంగా కనకయ్య సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు.

లంచం ఇచ్చినా పేరు లేదు
కనకయ్య చెప్పిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత (Congress Leader) తనను లబ్దిదారుల జాబితాలో (Beneficiaries List) పెట్టేందుకు రూ.50,000 లంచం (Bribe) అడిగాడట. కనకయ్య అప్పటికే రూ.20,000 ఫోన్‌పే ద్వారా పంపినట్లు చెప్పాడు. అయినా జాబితాలో తన పేరు రాలేదని బాధతో తెలిపాడు.

కిష్టాపురంలో అధికారులను బంధించి..
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం కిష్టాపురం (Kishtapuram) గ్రామంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. ఇందిర‌మ్మ ఇంటికి అర్హ‌త లేక‌పోయినా ఉద్యోగాలు, భూములు ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యాలయంలో అధికారులను బంధించి తాళం వేసి నిరసన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలు, రాజకీయ ప్రాబల్యం, లంచాలు ఏ స్థాయికి వెళ్లాయో ఈ ఘటనలు సూచిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment