IND vs PAK: నేడే హైటెన్షన్ పోరు.. కానీ, వ‌ర్ష గండం

IND vs PAK: నేడే హైటెన్షన్ పోరు.. కానీ, వ‌ర్ష గండం

Summarize with AI

T20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ 2026లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోరు మ‌రికొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌నుంది. చిరకాల ప్రత్యర్థులు భార‌త్ – పాకిస్తాన్‌ ఈరోజు కొలొంబోలో రాత్రి 7 గంటలకు తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్ష గండం పొంచిఉంది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా జరగకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతేడాది జరిగిన ఘటనల తర్వాత రెండు దేశాలు ప్రపంచకప్‌లో మొదటిసారి తలపడుతున్నాయి. అందుకే ఈ మ్యాచ్‌కు అటు పొలిటిక‌ల్ గానూ, ఇటు ఎమోష‌న‌ల్‌గానూ ప్రాధాన్యం కూడా సంత‌రించుకుంది. పాక్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి జోష్‌లో ఉండగా, ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

అభిషేక్ శర్మ మళ్లీ జట్టులోకి రానుండగా సంజు శాంసన్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. బుమ్రా, అర్షదీప్ పేస్ బాధ్యతలు చేపడతారు.
పాక్ వైపు బాబర్, షాదాబ్, షహీన్ అఫ్రిది ప్రధాన బలాలు. స్పిన్ దాడి కూడా భారత్‌కు సవాల్‌గా మారొచ్చు.

కొలంబోలో వర్షం పడే అవకాశం సుమారు 70 శాతం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇరు జట్లు 8 సార్లు తలపడగా భారత్ 7 విజయాలు సాధించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment