ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం.. పీహెచ్‌డీ స్కాల‌ర్‌ సూసైడ్‌

ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం.. పీహెచ్‌డీ స్కాల‌ర్‌ సూసైడ్‌

Summarize with AI

ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న అంకిత్ యాదవ్ (24) తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలోని నోయిడాకు చెందిన అంకిత్ యాద‌వ్‌, గతేడాది యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఐటీలో పరిశోధన కోసం చేరారు. ఆయన హాస్టల్ హెచ్-103 గదిలో ఉంటూ అధ్యయనం కొనసాగిస్తున్నారు. అయితే, సోమవారం అనూహ్యంగా గదిలోనే ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథ‌మిక విచార‌ణ‌లో మాత్రం అత‌ను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తేలింది.

ఘటనాస్థలంలో ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. త‌న మ‌ర‌ణానికి ఎవ‌రూ కార‌ణం కాద‌ని అందులో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దింపి ఆధారాలను సేకరిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లోనూ 28 ఏళ్ల పీహెచ్‌డీ స్కాల‌ర్‌ ఇదే క్యాంపస్‌లో సూసైడ్ చేసుకున్నారు. పలు విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment