హైదరాబాద్ బిర్యానీ తన అద్భుతమైన రుచితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గ్రేటర్ నగరం బిర్యానీ మరో గొప్ప ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఫుడ్ మరియు ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ విడుదల చేసిన “ప్రపంచ అత్యుత్తమ వంటకాలు” జాబితాలో హైదరాబాద్ బిర్యానీ 31వ స్థానం దక్కించుకుంది.
ఈ జాబితాలో మొత్తం 15,478 వంటకాలు పోటీ పడగా హైదరాబాదీ బిర్యానీ తన ప్రత్యేకమైన రుచి మరియు అనుభూతితో ఈ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కొలంబియా వంటకం లెచోనా కైవసం చేసుకుంది.
దక్షిణ భారత రుచికి ప్రపంచ గుర్తింపు
దక్షిణ భారత వంటకాలకు పేరుగాంచిన రెస్టారెంట్ల జాబితాలో ITC కోహినూర్ మూడో స్థానంలో నిలిచింది. ఈ విజయం భారత్ గర్వించదగిన విషయం. హైదరాబాద్ బిర్యానీ మన రుచిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది.








