“కూటమి ధర్మానికి టీడీపీ తూట్లు” – బీజేపీ ఫైర్‌

"కూటమి ధర్మానికి టీడీపీ తూట్లు" - బీజేపీ ఫైర్‌

Summarize with AI

కూటమి కట్టుబాట్లను(Alliance Commitments, మిత్రధర్మాన్ని(Coalition Dharma) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) నాయకులు నిలువునా తొక్కేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party – BJP) నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) లెక్కింపు వేళ విశాఖలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య తీవ్ర విభేదాలు రచ్చకెక్కాయి. విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) 39వ వార్డు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి దామోదర్ యాదవ్ (Damodar Yadav) మీడియా సమావేశంలో టీడీపీ నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కూటమి ఒప్పందంలో భాగంగా 39వ వార్డు నుంచి పోటీ చేసిన నన్ను ఓడించడానికి టీడీపీ నాయకుడు సీతంరాజు సుధాకర్ (Seethamraju Sudhakar) కుట్రలు చేశారు. బీజేపీ అభ్యర్థినైన నన్ను ఓడించేందుకు క్షేత్రస్థాయిలో పచ్చ నేతలు కుట్రలు పన్ని చుక్కలు చూపించారు. సీతంరాజు సుధాకర్ ఒక వెదవ, దొంగ. అలాంటి వ్యక్తి అసలు కూటమిలో ఉండటానికి అర్హుడా?” అని ప్రశ్నించారు.

“సీతంరాజు సుధాకర్‌ను తెలుగుదేశం పార్టీ(TDP) నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలి. ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేయకపోతే నా శవాన్ని చూస్తారు. లేకపోతే టీడీపీ కార్యాలయం ముందే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతాం” అని హెచ్చరికలు జారీ చేశారు.

కూటమి ధర్మాన్ని క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం మిత్రపక్షాలను అణచివేస్తున్నారని బీజేపీ(BJP) నాయకులు మండిపడ్డారు. “ఇకపై ఎవరైనా బీజేపీకి బలం లేదు అని తేలికగా మాట్లాడితే నాలుక చీరేస్తాం” అని దామోదర్ యాదవ్ హెచ్చరించారు.

ఎన్నికల్లో కూటమి అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన రెబల్ అభ్యర్థులను తిరిగి కూటమి పార్టీల్లోకి చేర్చుకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ వేళ విశాఖలో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి స్వయంగా టీడీపీ నేతలపై తిరుగుబాట చేసి, ఆత్మహత్య హెచ్చరికలు జారీ చేయడం కూటమిలో అంతర్గత విభేదాలను, “కూటమి ధర్మం” (Coalition Dharma) పేరిట సాగుతున్న డొల్లతనాన్ని బ‌య‌ట‌పెట్టింది.

Join WhatsApp

Join Now

Leave a Comment