హైడ్రా విధుల్లో డీఆర్‌ఎఫ్ కీలకం – రంగనాథ్

హైడ్రా విధుల్లో డీఆర్‌ఎఫ్ కీలకం - రంగనాథ్

Summarize with AI

హైదరాబాద్‌లో హైడ్రా నిర్వహించే సేవలలో డీఆర్‌ఎఫ్ (DRF) బృందాల పాత్ర మరింత కీల‌కం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల అంచనాలను తీర్చే విధంగా హైడ్రా కార్యకలాపాలు కొనసాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు.

357 మంది కొత్త సభ్యులకు ప్రత్యేక శిక్షణ
డీఆర్‌ఎఫ్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్తగా నియమితులైన 357 మంది సభ్యులకు గురువారం శిక్షణ ప్రారంభమైంది. అంబర్‌పేట పోలీసు శిక్షణ కేంద్రంలో వారానికి ఒకసారి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో డీఆర్‌ఎఫ్ అత్యంత కీలకమైన భూమిక పోషిస్తుందని, ఇప్పుడు హైడ్రా విధులు కూడా ఈ బృందానికి తోడయ్యాయని వివరించారు.

ఇసుక అక్రమ రవాణా నియంత్రణ కూడా
ప్రభుత్వం డీఆర్‌ఎఫ్‌పై నమ్మకంతో కొత్త బాధ్యతలను అప్పగించిందని, తాజాగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే బాధ్యతను కూడా అందించినట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ బాధ్యతలను కట్టుదిట్టంగా, నిబద్ధతతో నిర్వహించాల్సిన అవసరముందని సూచించారు.

పారదర్శకంగా నియామకాలు
పోలీసు పరీక్షల్లో కొద్దిపాటి మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులను, మెరిట్ లిస్ట్ మరియు సామాజిక అంశాల ఆధారంగా పారదర్శకంగా నియమించినట్లు తెలిపారు. ప్రస్తుత ఉద్యోగ పోటీ పరిస్థితుల్లో అందరికీ లభించిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కమిషనర్ హితవిచ్చారు. భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజలకు అండగా ఉండేందుకు డీఆర్‌ఎఫ్ కొత్తగా నియమితులైన సభ్యులు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ అనుమతి మేరకు, భవిష్యత్‌లో మరిన్ని కీలక బాధ్యతలు ఈ బృందానికి అప్పగించే అవకాశముందని రంగనాథ్ అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment