సున్నం చెరువు కూల్చివేతలు.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

సున్నం చెరువు కూల్చివేతలు.. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

Summarize with AI

రేవంత్ స‌ర్కార్ (Revanth Government) ప్ర‌వేశ‌పెట్టిన హైడ్రా (HYDRA) ప‌నితీరుపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) మారోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో హైడ్రా చేప‌ట్టిన సున్నం చెరువు పరిధిలో కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అధికారులు కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించేలా చర్యలు చేపట్టారంటూ హైకోర్టు విరుచుకుపడింది. ప్రజలు నివసించే స్థలాల్లో ఫెన్సింగ్ వేసి కూల్చివేతలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది.

హైకోర్టు స్పష్టం చేసిన దృష్టిలో, గ్రీన్ ట్రిబ్యునల్ (Green Tribunal) నివేదికను పరిగణలోకి తీసుకోకుండా, FTL నిర్ధారణ లేకుండానే హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడం చట్ట వ్యతిరేక చర్యగా పేర్కొంది. “FTL నిర్ధారణే జరగనప్పుడు, హద్దులు ఎట్లా నిర్ణయించారు? సర్వే ఎందుకు చేయలేదు?” అంటూ కోర్టు ప్రశ్నించింది. ముఖ్యంగా సియేట్ కాలనీ నివాసుల భూముల్లో ఫెన్సింగ్ వేయడం ద్వారా వారి హక్కులను కించపరిచారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A కింద ఉన్న ఆస్తి హక్కుల ఉల్లంఘన అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో, సియేట్ కాలనీ వాసుల భూముల్లో ఫెన్సింగ్, కూల్చివేతలు వంటి చర్యలను తక్షణం ఆపాలని హైడ్రా అధికారులను హైకోర్టు ఆదేశించింది. ప్రజలకు హాని కలిగించే చర్యలు తీసుకునే ముందు తప్పనిసరిగా చట్టపరమైన ప్రక్రియలను అనుసరించాలని, పరిశీలనాత్మక సర్వేలు జరపాలని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ త్వరలో జరగనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment