హైదరాబాద్‌లో(Hyderabad) డ్రగ్స్ పెడ్లర్ (Drugs Peddler) రెచ్చిపోయాడు. తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (Narcotic Enforcement Wing) పోలీసులపైకి (Police)కారును (Car)ఎక్కించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు (Constable) కాలు ఫ్రాక్చర్ (Leg Fracture) కాగా, ఇన్‌స్పెక్టర్ (Inspector) సహా మరో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం మధ్యాహ్నం అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కారులో అబిడ్స్‌లోని (Abids) పాయల్ ఫుట్‌వేర్ (Payal Footwear) వద్దకు వచ్చి డ్రగ్స్ సరఫరా (Drugs Supply) చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
పోలీసులు అడ్డుకోవడంతో కారును పక్కకు తీస్తున్నట్లు నటించిన నిందితుడు ఒక్కసారిగా వాహనాన్ని వారిపైకి పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ (Constable Mahender) కాలికి ఫ్రాక్చర్ అయింది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడి కారును వెంబడించి అఫ్జల్‌గంజ్ (Afzalgunj) వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్(Inspector Srikanth), కానిస్టేబుల్ వంశీధర్‌కు (Constable Vamsidhar) స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడిని హుస్సేనీ ఆలంకు (Hussaini Alam) చెందిన సైఫ్‌గా (Saif) పోలీసులు గుర్తించారు.
గాయపడిన కానిస్టేబుల్ మహేందర్‌ను చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








