రాహుల్ గాంధీ పై హరీశ్‌రావు ఫైర్

రాహుల్ గాంధీ పై హరీశ్‌రావు ఫైర్

Summarize with AI

బీఆర్‌ఎస్ (BRS) సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ ‘సినిమా యాక్టర్ల కంటే ఎక్కువగా యాక్టింగ్ చేశారని’ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఆటో డ్రైవర్ల సమస్యలపై హైదరాబాద్‌ (Hyderabad)లోని ఎర్రగడ్డ (Erragadda) వద్ద బీఆర్‌ఎస్ నిర్వహించిన ఆందోళనలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు, ఆటో కార్మికులకు హామీలు ఇచ్చి, రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఇప్పుడు వాటిని విస్మరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, పేరుకు ‘ఉచిత బస్’ అంటున్నారని, కానీ ఐదుసార్లు బస్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు.

“మంత్రులకు వాటాలు పంచుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ, ఆటో కార్మికులకు ఇవ్వడానికి ఉండవా?” అని ప్రశ్నించిన హరీశ్‌రావు, మద్యం ద్వారా వచ్చిన రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని ఆటో కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మళ్లీ హైదరాబాద్ వస్తే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆటో కార్మికులు అడ్డగిస్తారని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment