అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. – కొడాలి నాని క్లారిటీ

అదంతా త‌ప్పుడు ప్ర‌చారం.. - కొడాలి నాని క్లారిటీ

Summarize with AI

త‌న‌పై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌ను తిప్పికొట్టారు కొడాలి నాని. వైసీపీ (YCP) ఫైర్ బ్రాండ్‌గా లీడ‌ర్‌గా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) రాజకీయాలకు దూరమవుతున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నారని సోషల్ మీడియా (Social Media)లో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆయన అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్(Viral) గా మారింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఈ వార్తలపై కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలను నమ్మొద్దని, త‌న గురించి జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం. రాజకీయాల నుంచి వైదొలగే ఆలోచన ఏదీ లేదు అని ఆయ‌న‌ స్పష్టం చేశారు. అది ఫేక్ పోస్ట్ (Fake Post) అని ఆయన తేల్చి చెప్పారు. దాన్ని ఎవరూ నమ్మొద్దని స్వయంగా సోషల్ మీడియాలో స్పందించారు కొడాలి నాని. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment