ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటం సాధించిన గోవా సుందరి

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటం సాధించిన గోవా సుందరి

భువనేశ్వర్‌లో (Bhubaneswar) ఘనంగా ముగిసిన ఫెమినా మిస్ ఇండియా (Femina Miss India) 2026 పోటీలో గోవా కు (Goa) చెందిన సాధ్వీ సతీశ్ సైల్ (Sadhvi Satish Sail) ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ (Femina Miss India World) 2026గా విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 30 మంది సుందరీమణులను వెనక్కి నెట్టి సాధ్వీ విజయం సాధించారు. మహరాష్ట్రకు చెందిన రాజ్ నందిని పవార్ (Raj Nandini Pawar) ని తొలి రన్నరప్ గా, జమ్ముకాశ్మీర్ కు చెందిన డాక్టర్ అద్వైత రెండో రన్నరప్ గా నిలిచారు.

తన విజయ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొన్న సాధ్వీ సతీశ్ సైల్, అంతర్జాతీయ వేదికపై భారత్‌ను (India) ప్రతినిధిత్వం చేయడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. నిజాయితీ, కరుణ మరియు ఆత్మస్వభావంతో ముందుకు సాగుతానని ఆమె స్పష్టం చేశారు. కేవలం మూడు నెలల కఠిన శ్రమతోనే ఈ పోటీకి సిద్ధమయ్యానని వెల్లడించిన ఆమె, యువతకు “ఇతరులతో పోల్చుకోకండి, మీ ప్రత్యేకతే మీ బలం” అని ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. ఆమె విజయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment