ఇక 15 రోజుల్లోనే.. ఓటర్ ఐడీ కార్డులపై ఈసీ కీలక ప్రకటన

ఇక 15 రోజుల్లోనే.. ఓటర్ ఐడీ కార్డులపై ఈసీ కీలక ప్రకటన

Summarize with AI

ఓటర్ ఐడీ (Voter ID) కార్డుల జారీ (Cards Issuance) ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (EC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై, కొత్త ఓటర్ ఐడీ కార్డులు లేదా అప్‌డేట్ చేసిన కార్డులను 15 రోజుల్లోపు (Within 15 Days) ఓటర్లకు అందజేయాలని ఈసీ(EC) ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ఎలక్టర్ ఫోటో గుర్తింపు కార్డు (EPIC) అందజేయడానికి నెల కంటే ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో, ఈ కొత్త విధానం ఓటర్లకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ఈసారి, EPIC స్థితిని ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్లకు తెలియజేయడంతో పాటు, నిర్ణీత 15 రోజుల్లోనే కార్డును అందజేయనున్నారు.

ఈ కొత్త విధానం కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న వారికి, అలాగే తమ ఓటరు వివరాల్లో మార్పులు చేసుకున్న వారికి వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ కొత్త వ్యవస్థలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) ద్వారా EPIC జనరేషన్ నుండి పోస్ట్స్ డిపార్ట్‌మెంట్ (DoP) ద్వారా ఓటరుకు కార్డు డెలివరీ అయ్యే వరకు ప్రతి దశను రియల్-టైమ్ ట్రాకింగ్ చేస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ పారదర్శక, వేగవంతమైన విధానం ఓటర్లకు మరింత సౌలభ్యాన్ని అందించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment