BREAKING: ఢిల్లీ, యూపీ, హరియాణాలో భూకంపం..

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)తో పాటు హరియాణా (Haryana), ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదు అయింది.

ప్రజల్లో భయాందోళన

పదిహేను సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భయంతో ఇంటి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో భయపడి బయటకు వచ్చి రోడ్లపైకి చేరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భూకంప కేంద్రం ఎక్కడ?

ఈ భూకంపానికి కేంద్ర బిందువుగా హరియాణాలోని రోహ్తక్ (Rohtak, Haryana) ప్రాంతం గుర్తించబడింది. భూకంపం కారణంగా ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment