ఒకప్పుడు తన గ్లామర్, అందంతో తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ నటి నమిత(Namitha) మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) కలిసి నటించిన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నమిత.. పెళ్లి తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా జిమ్‌లో వర్కౌట్లు (Gym Workouts) చేస్తున్న వీడియోను పంచుకోవడంతో ఆమె కొత్త లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఒకప్పుడు బొద్దుగా కనిపించిన నమిత.. ఇప్పుడు పూర్తిగా స్లిమ్‌గా మారి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఆమె ట్రాన్స్‌ఫర్మేషన్ (Transformation) చూసిన అభిమానులు “ఇది నిజంగా నమితేనా?”, “వావ్.. సూపర్ ట్రాన్స్‌ఫర్మేషన్”, “గుర్తుపట్టలేనంతగా మారిపోయారు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం నమిత జిమ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా, ఆమె ఫిట్‌నెస్ జర్నీపై సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.








