ఏపీ విద్యాశాఖ మంత్రిని తాకిన ఢిల్లీ రాజీనామా సెగ‌

ఏపీ విద్యాశాఖ మంత్రిని తాకిన ఢిల్లీ రాజీనామా సెగ‌

Summarize with AI

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో మెగా డీఎస్సీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. యువ‌త ఉద్యోమంతో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. అదే తరహాలో ఏపీలో మెగా డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి నేరుగా లోకేష్‌ను ప్రశ్నిస్తూ పోస్టు చేసింది.

‘మరి లోకేష్ రాజీనామా ఎప్పుడు?’
దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా యువత చేసిన పోరాటానికి వైసీపీ అభినందనలు తెలిపింది. యువత నుంచి వచ్చిన ఒత్తిడితో చివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది.

ఈ పరిణామాన్ని ఏపీలో జరిగిన మెగా డీఎస్సీ నియామకాలతో ముడిపెడుతూ నారా లోకేష్‌పై వైసీపీ రాజకీయ ఒత్తిడి పెంచుతోంది. ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదర్శంగా తీసుకుని మెగా డీఎస్సీ అక్రమాల ఆరోపణలకు బాధ్యత వహిస్తూ లోకేష్ కూడా తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. “నీట్ లీకేజీకి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. మరి డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా ఎప్పుడు?” అంటూ వైసీపీ ప్రశ్నించింది.

సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధం కాలేదు?’
డీఎస్సీ-2025 నియామకాల్లో తీవ్రమైన అవకతవకలు జరిగాయని వైసీపీ కొంతకాలంగా ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని చెబుతోంది. మెగా డీఎస్సీ అవ‌క‌త‌వ‌క‌ల కార‌ణంగా ఉద్యోగావ‌కాశాలు కోల్పోయామ‌ని బాధిత అభ్య‌ర్థులు సైతం వైసీపీ త‌లుపుత‌ట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ డిమాండ్ చేసినప్పటికీ చంద్ర‌బాబు ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.

తప్పులు జరగకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన వైసీపీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి డీఎస్సీ అక్రమాల ఆరోపణలను తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇటీవల ఇదే అంశాన్ని వైసీపీ పార్లమెంట్ వరకు తీసుకెళ్లింది. మెగా డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. దీంతో డీఎస్సీ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చకు తీసుకెళ్లేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.

‘ఇవాళ ప్రధాన్ వంతు.. రేపు లోకేష్ వంతు’
ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యాశాఖ మంత్రిగా మెగా డీఎస్సీ నియామకాల బాధ్యత నారా లోకేష్‌పైనే ఉంటుందని, అందువల్ల అక్రమాల ఆరోపణలకు ఆయన రాజకీయంగా, నైతికంగా బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.

“ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ వంతు అయింది.. రేపు లోకేష్ వంతు” అంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడినందుకు, డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారని రాష్ట్ర యువత నారా లోకేష్‌ను ప్రశ్నిస్తోందంటూ వైసీపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment