పిఠాపురంలో దారుణం.. దళిత విద్యార్థులపై జాతి వివక్ష (Videos)

పిఠాపురంలో దారుణం.. దళిత విద్యార్థులపై జాతి వివక్ష

Summarize with AI

న‌టుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency)లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దళిత విద్యార్థులపై (Dalit Students) జాతి వివక్ష బ‌య‌ట‌ప‌డింది. పిఠాపురం, యూ.కొత్తపల్లి మండలం యండపల్లి (Yandapalli) హైస్కూల్‌ (High School)లో ఉపాధ్యాయులు (Teachers) దళిత విద్యార్థులను కులం పేరుతో అవమానిస్తున్నారని, బూతులు తిడుతూ బాధ పెడుతున్నారని బాధిత విద్యార్థులు మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. “మీది వెధవ జాతి.. ఎస్సీలు ఏమైనా పుడింగులా?” అంటూ దుర్భాష‌లాడుతున్నార‌ని

ఇంగ్లీషు టీచర్ శ్రీనుబాబు (Srinubabu), స్కూల్ హెచ్‌ఎం సురేష్ భూషణం (Suresh Bhushanam) తమ పిల్లలను తరచూ కులం పేరుతో తిట్టి హింసిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమ్మాయిలను జంతువుల‌ చెడ్డపేర్లు పెట్టి పిలుస్తున్నారని విద్యార్థులు ధైర్యంగా మీడియా ఎదుట వెల్లడించారు. ఈ విషయాలు వినిపించిన తల్లిదండ్రులు మీడియా ఎదుట కన్నీళ్లు ఆపుకోలేక పోయారు.

స్కూల్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులు.. “దేవాలయం లాంటి పాఠశాలలో కుల వివక్ష ఎందుకు? మా పిల్లలను కుల పేరుతో ఎందుకు అవమానిస్తున్నరు?” అంటూ ప్రశ్నించారు. తమ పిల్లలకు మానసిక వేధింపులు ఎదురవుతున్నాయని, ఇక భరించలేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళిత విద్యార్థులపై జరుగుతున్న ఈ అన్యాయాన్ని వెంటనే ఆపాలని, సంబంధిత ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment