స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!

స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!

Summarize with AI

లోక్‌సభలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తమైంది. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. స్పీకర్‌ను సెక్షన్ 94C కింద తొలగించాలని విపక్షం డిమాండ్ చేస్తూ 103 మంది ఎంపీల సంతకాలతో నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేసింది. జనవరి 28 నుంచి ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల సమయంలో వివాదాలు క్రమంగా తీవ్రతరంగా మారుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం, ధన్యవాద తీర్మానంపై చర్చలలో ప్రతిపక్షం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.

స్పీకర్ ఓం బిర్లా ఫిబ్రవరి 4న కాంగ్రెస్ మహిళా ఎంపీలపై ప్రధాని మోడీపై దాడి కుట్ర చేసినట్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, విపక్షం ఆగ్రహంలో ఉంది. విపక్ష నేతలు స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సభలో వారి మాట్లాడే హక్కును నిలిపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, పార్లమెంట్ లో రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసింది. స్థానిక మరియు కేంద్ర రాజకీయ వర్గాల్లో ఈ సంఘటనపై చర్చలు, ఉత్కంఠ కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment