సినీ పరిశ్రమ (Film Industry)లో అవకాశాలు (Opportunities) చూపిస్తామనే ముసుగులో బాలిక (Girlపై దారుణ లైంగిక దాడి (Sexual Assault) జరిగిన ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి (9th Class) చదువుతున్న 13ఏళ్ల బాలిక తన పెద్దమ్మ వద్ద నివసిస్తోంది. తరచుగా ఆమె ఇంటికి వచ్చే ఇద్దరు సినీ ఇండస్ట్రీ వ్యక్తులు బాలికపై కన్నేశారు.
కడప జిల్లా చెందిన కో-డైరెక్టర్ బండి వెంకట శివారెడ్డి (Bandi Venkata Shiva Reddy), కెమెరామెన్ పెనికెలపాటి అనిల్ (Penikelapati Anil) పేర్లతో ఉన్న నిందితులు, సినిమా–సీరియల్ అవకాశాలు తెస్తామంటూ బాలికను నమ్మించారు. ఈ విషయాన్ని వారు బాలిక పెద్దమ్మకు చెప్పగా, వారిద్దరికీ సినీ పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్నాయని, వారితో చనువుగా ఉంటే భవిష్యత్తు బాగుంటుందని పెద్దమ్మ కూడా బాలికను ప్రోత్సహించినట్లు తెలుస్తోంది.
ఇద్దరు నిందితులు పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు జరిగిన దారుణాన్ని భయంతో బాధపడుతున్న బాలిక తన పాఠశాల ఉపాధ్యాయురాలికి వివరించింది. ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే స్పందించి బాలిక పెద్దమ్మతో పాటు కో-డైరెక్టర్, కెమెరామెన్‌లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.








