ఎమ్మెల్సీ ఎన్నిక‌లో ఓట‌మి.. మంత్రులకు సీఎం కీలక ఆదేశం

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మి.. మంత్రులకు సీఎం కీలక ఆదేశం

Summarize with AI

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచే దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మెరుగైన ఫలితాల కోసం మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పని చేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు వేగంగా అమలవ్వాలంటే ఇద్దరి మధ్య సమన్వయం చాలా అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమితో..
ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా విఫలమైంది. ఈ ఫలితాలు రిపీట్ కాకుండా ఉండేందుకు ముందస్తుగానే సీఎం మంత్రులను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న రాజకీయ, అభివృద్ధి సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సమావేశాలు పూర్తయ్యాయి. త్వరలో మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి సమావేశాలు జరుగనున్నాయి.

ఓటమి వెనుక కారణాలు
కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గంలో పదవుల పంపకాల ఆలస్యం కావడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడం, మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఏర్పడటం ఓటమికి దారితీసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించాలంటే సమన్వయం కచ్చితంగా అవసరమని సీఎం స్పష్టం చేశారు. ప్రతి రెండు లేదా మూడు నెలలకు ఒక్కసారి సమావేశాలు నిర్వహించాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment