విజయవాడలో దారుణం..పెళ్లైన యువతి న్యూడ్ ఫొటోలతో బెదిరింపులు

విజయవాడలో దారుణం..పెళ్లైన యువతి న్యూడ్ ఫొటోలతో బెదిరింపులు

Summarize with AI

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన సైబర్ వేధింపుల ఘటన చివరకు వీధిలో దాడులకు దారితీసింది. పెళ్లైన యువతి పాత న్యూడ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా, ఆమె భర్తకు పంపి కాపురం కూల్చిన మాజీ ప్రియుడిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పబ్లిక్‌గా విచక్షణారహితంగా దాడి చేశారు.

విజయవాడకు చెందిన వివాహితతో గతంలో సన్నిహితంగా ఉన్న మాజీ ప్రియుడు.. ఆమెకు పెళ్లయిన తర్వాత కూడా వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. గత నెల రోజులుగా తన్ను కలవాలంటూ ఒత్తిడి తెచ్చాడు. త‌న‌ను క‌ల‌వాల‌న్న డిమాండ్‌ను యువతి తిరస్కరించడంతో, పగ పెంచుకున్న నిందితుడు వారిద్దరూ గతంలో సన్నిహితంగా ఉన్న న్యూడ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను బాధితురాలి భర్తకు కూడా వాట్సాప్ ద్వారా పంపాడు.

ఈ దృశ్యాలు బయటకు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. తన భార్యను వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీరుమున్నీరైంది. మాజీ ప్రియుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న యువతి కుటుంబ సభ్యులు ఒక పథకం వేశారు. అతనితో మాట్లాడి విజయవాడలోని పీవీపీ (PVP) మాల్ సమీపానికి రప్పించారు.

నిందితుడు అక్కడకు చేరుకోగానే యువతి బంధువులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. పీవీపీ మాల్ పరిసర ప్రాంతాల్లో నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా చితకబాదారు. స్థానికులు వారిస్తున్నప్పటికీ వినకుండా దాడి కొనసాగించారు. ఈ గొడవను చూసిన స్థానికులు వెంటనే ధర్నా చౌక్ ప్రాంతంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. యువతిని బెదిరించి కాపురం కూల్చడమే కాకుండా సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టినందుకు నిందితుడిపై ఐటీ యాక్ట్, వేధింపుల కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment