కార్వేటినగరంలో దారుణం.. ఏకంగా కానిస్టేబుల్‌పై టీడీపీ దాడి

కార్వేటినగరంలో దారుణం.. ఏకంగా కానిస్టేబుల్‌పై టీడీపీ దాడి

చిత్తూరు జిల్లా (Chittoor District) కార్వేటినగరంలో (Karvetinagaram) అధికార పార్టీ శ్రేణులు బరితెగించాయి. అక్రమ గ్రావెల్ దందాను (Illegal Gravel Mining) ప్రశ్నించినందుకు ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్‌పై (Yugandhar) టీడీపీ (TDP) నాయకులు ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు సమాచారం.

అసలేం జరిగింది?
బాధితుడు యుగంధర్ తన భార్య చంద్రకళను (Chandrakala) కృష్ణ సముద్రంలో దించి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలోని అమ్మపల్లి క్రాస్ వద్ద ఈ ఘోరం జరిగింది. అప్పటికే అక్కడ కాపుకాసిన నిందితులు కానిస్టేబుల్‌ను అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. దాడికి పాల్పడిన ప్రధాన నిందితులు అన్నూరు మాజీ సర్పంచ్ ఆదాం (Adam) (సుందర్ రాజ్), ప్రవీణ్ కుమార్ (Praveen Kumar),, భాగ్య రాజ్ (Bhagya Raj) అని తేలింది.

అక్రమ దందాలే కారణమా?
స్థానికంగా జరుగుతున్న అక్రమ గ్రావెల్ మైనింగ్‌ను కానిస్టేబుల్ యుగంధర్ ప్రశ్నించడమే ఈ దాడికి ప్రధాన కారణమని బాధితుడి భార్య చంద్రకళ ఆరోపిస్తున్నారు. తన భర్తను చంపే ఉద్దేశంతోనే పక్కా పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. “అక్రమ దందాలను అడ్డుకున్నాడనే కక్షతోనే నా భర్తపై దాడి చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన వారే ఇలా రౌడీల్లా ప్రవర్తించడం దారుణం” అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment