భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (Bharat Rashtra Samithi – BRS) నేడు 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని (26th Foundation Day) ఘనంగా జరుపుకుంటోంది. 2001 ఏప్రిల్ 27న ప్రారంభమైన ఈ పార్టీ, విజయవంతంగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసి 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) ఉదయం 11 గంటలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పార్టీ జెండా (Party Flag) ఆవిష్కరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధిష్టానం కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్(KCR) అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
సమావేశంలో పార్టీ 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర, 10 ఏళ్ల పాలన ప్రస్థానం, గత 2.5 ఏళ్ల ప్రతిపక్ష పోరాటంపై కేసీఆర్ సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి సంస్థాగత మార్పులు, కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ తదుపరి వ్యూహంపై ఈ సమావేశం కీలకంగా మారనుంది.
నేడు బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం.. 25 ఏళ్ల ప్రస్థానం








జనసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. వైసీపీ ఎమ్మెల్సీ సవాల్