Operation Sindoor : పాక్ ఉగ్ర‌స్థావ‌రాల‌పై భారత్ మెరుపుదాడులు

bharat-pakistan-operation-sindhoor-strikes-on-terror-camps-2025

Summarize with AI

ప‌హ‌ల్గామ్ (Pahalgam) ఉగ్ర‌దాడికి (Terrorist Attack) భార‌త్ (India) ప్ర‌తీకార చ‌ర్య‌లు చేప‌ట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు “ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor)” పేరుతో పాకిస్తాన్‌ (Pakistan) లోని ఉగ్రస్థావరాలపై (Terrorist Camps) భారీ మెరుపుదాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌ను భారత ఆర్మీ (Indian Army), ఎయిర్‌ఫోర్స్ (Air Force), నేవీ (Navy) బలగాలు (Forces) సంయుక్తంగా అమలు చేశాయి. ఉగ్రవాద స్థావరాలపై నిఖార్సైన మిస్సైల్ దాడులతో భారత్ విరుచుకుపడింది.

ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఉగ్రవాద స్థావ‌రాల‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు జరిపింది. భారత్ అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం, పాక్ సైనిక స్థావరాలను టార్గెట్ చేయకుండా, కేవలం ఉగ్రవాద స్థావరాలకే దాడులు పరిమితమయ్యాయి.

ఈ మెరుపుదాడులపై రాత్రి భారత ఆర్మీ “ఎక్స్”లో పోస్ట్ చేసింది. లష్కరే తోయిబా (Lashkar-e-Toiba), జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రసంస్థల స్థావరాలు ఉన్న కోట్లీ, బహావల్‌పూర్, ముజఫరాబాద్ ప్రాంతాలు దాడుల్లో ప్రధాన లక్ష్యాలుగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైనవారిని శిక్షించేందుకు భారత్ కట్టుబడి ఉందని వెల్లడించింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. ఈ ఉదయం 10 గంటలకు రక్షణశాఖ మీడియా సమావేశంలో హాజరయ్యే అవకాశం ఉంది.

భద్రతా చర్యలలో భాగంగా శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, ధర్మశాల, లేహ్ వంటి కీలక విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ “భారత్ మాతాకీ జై” అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. 1971 యుద్ధానంతరం ఇదే తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో భారత్ ఇంత పెద్ద స్థాయిలో దాడులు నిర్వహించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment