ప్రశ్న రావణ్ ఎవరు..? పవన్ కోసం టీడీపీ వదిలిన ఆయుధమా..?

ప్రశ్న రావణ్ ఎవరు..? పవన్ కోసం టీడీపీ వదిలిన ఆయుధమా..?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్'(Prashna Ravana) అరెస్టు వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక సోషల్ మీడియా కేసుకు పరిమితం కాలేదు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో అధికార కూటమి (టీడీపీ-జనసేన)(TDP-Jana Sena), ప్రతిపక్ష వైసీపీల(YSRCP) మధ్య తీవ్ర దుమారానికి కేంద్రబిందువుగా మారింది. మొదట ఇదొక యూట్యూబర్ అరెస్టు అంశంగానే కనిపించినా.. ప్రస్తుతం “ప్రశ్న రావణ్ అసలు ఎవరి మనిషి? ఎవరి ప్రయోజనాల కోసం ప‌నిచేస్తున్నాడు?” అనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌ను నిశితంగా గమనిస్తే.. పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) మానసికంగా దెబ్బతీసేందుకు, జనసేన ఎదుగుదలను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ(TDP) తెరవెనుక ఆడిన పెద్ద స్కెచ్ ఇదనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

రాజకీయ వర్గాల్లో ప్ర‌స్తుతం వినిపిస్తున్న విశ్లేషణల ప్రకారం.. ప్రశ్న రావణ్ గతంలో చేసిన యూట్యూబ్ వీడియోల ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన ఎవరి కోవర్టో స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (YSRCP Government) అప్పటి సీఎం వైఎస్ జగన్‌పై (Y. S. Jagan Mohan Reddy), ఆయన విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు, దూషణలు చేసిన చరిత్ర ఈ రావణ్‌కు ఉంది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్‌ల‌ను(Nara Lokesh) విమర్శిస్తూ రావణ్ ఒక్క వీడియో కూడా చేయకపోవడం గమనార్హం.

“జగన్ కంటే లోకేష్ ఎంతో మెరుగైన నాయకుడు, విజనరీ” అంటూ నారా లోకేష్‌ను ఆకాశానికెత్తుతూ రావణ్ తన యూట్యూబ్ ఛానల్‌లో చేసిన పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను బట్టి చూస్తే.. రావణ్‌ను వెనుక ఉండి నడిపించింది, ప్రోత్సహించింది ముమ్మాటికీ టీడీపీ సోషల్ మీడియా విభాగాగాలేనని వైసీపీ నేతలు గట్టిగా ఆరోపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌ను దెబ్బతీయడానికే.. టీడీపీ ‘ఆయుధం’?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) నేరుగా ఢీకొట్టడం ఇష్టం లేక, ప్రశ్న రావణ్‌ను ఒక ఆయుధంగా వాడుకున్నారనే చర్చ సాగుతోంది. తీరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతల ఒత్తిడితో రావణ్ అరెస్టు కాగానే.. ఆ నెపాన్ని వైసీపీపై(YSRCP) నెట్టేసి, ‘ఎల్లో మీడియా'(Yellow Media) ద్వారా అసత్య ప్రచారాలు మొదలుపెట్టడం కూటమి రాజకీయ జిమ్మిక్కులకు నిదర్శనమని విమర్శకులు మండిపడుతున్నారు.

కొడాలి నాని, కాకాణి సంచలన వ్యాఖ్యలు
ప్రశ్న రావణ్ అరెస్టుపై మాజీ మంత్రులు కొడాలి నాని, కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి వైసీపీ వాడు ఎలా అవుతాడని కొడాలి నాని(Kodali Nani) ప్రశ్నించారు. రావణ్ టీడీపీ(TDP) అనుకూల వ్యక్తి అని, రావణ్‌పై టీడీపీ ఒక్క కేసు కూడా పెట్ట‌లేద‌ని, జనసేనతో కలిసి స్టేషన్ల వద్ద దాడికి ప్రయత్నించలేదని గుర్తుచేస్తున్నారు.

కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) కూడా ఇదే వాదనను గట్టిగా వినిపించారు. ప్రశ్న రావణ్ గతంలో బాబు, లోకేష్‌లకు అనుకూలంగా వ్యవహరించిన పాత వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. చట్టపరమైన విధానాలు పాటించకుండా అర్ధరాత్రి అరెస్టులు చేయడాన్ని, రాజ్యాంగ ఉల్లంఘనలను మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని, అంతేకానీ రావణ్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం వైసీపీకి లేదని స్పష్టం చేశారు.

ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం రాజ‌కీయంగానూ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేందుకు టీడీపీ వదిలిన బాణమే ఈ రావణ్ అని, ఇప్పుడు కేసు తీవ్ర‌ద‌శ‌కు చేరుకోవ‌డంతో ఆ బురదను వైసీపీపై చల్లేందుకు టీడీపీ అనుకూల మీడియా తాపత్రయపడుతోందని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ ఉదంతం రాబోయే రోజుల్లో కూటమి రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment