కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) కుమారుడు బండి భగీరథ్‌కు (Bandi Bhagirath) సంబంధించిన పోక్సో కేసు (POCSO case) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మరింత హాట్ టాపిక్‌గా మారింది. కేసు నమోదైన తర్వాత కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన భగీరథ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు (Lookout Notices) జారీ చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు, దుష్ప్రచారాల వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు న్యాయమూర్తిని (High Court Judge) లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులపై హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసేందుకు జాయింట్ సీపీ శ్వేత (Joint CP Swetha) ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT) ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దామోదర్‌ను (Damodar) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైరల్ పోస్టుల మూలాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, కుట్ర కోణం వంటి అంశాలపై సిట్ సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా సిట్ రంగంలోకి దిగడంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.









అన్నపై పరోక్ష కౌంటరా?.. మనోజ్ వ్యాఖ్యలపై చర్చ