హైదరాబాద్ (Hyderabad) బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని (Loved Woman) ప్రియుడు (Boyfriend) అత్యంత కిరాతకంగా హత్య (Brutally Murder)చేసిన ఘటన కలకలం సృష్టించింది. హత్య అనంతరం మృతదేహాన్ని(Dead Body) గోనె సంచిలో(Gunny Bag) పెట్టి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీహార్‌కు(Bihar) చెందిన ఓ యువతి బాలాపూర్ పరిధిలోని ఫంక్షన్ హాళ్లలో పనిచేస్తోంది. ఆమెకు అహ్మద్(Ahmed) అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అహ్మద్ ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. మరోవైపు యువతి ప్రస్తుతం రెండు నెలల గర్భవతి. దీనితో ఆమెను ఎలాగైనా వదిలించుకునేందుకు అహ్మద్ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు కలిసి యువతిపై దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కత్తితో దారుణంగా హత్య
చేశారు.
హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బాలాపూర్ పోలీసులు (Balapur Police) నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్‌కు అతడి తల్లిదండ్రులు కూడా హత్యకు సహకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనలో ఇతరుల పాత్రపై విచారణ కొనసాగిస్తున్నారు.








